Vikarabad: వికారాబాద్ లో దోమ మండల ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు అంతా గుంతలమయంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న BT రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి.…