Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టిరీగా మారింది. 4వ తరగతి విద్యార్థిని అదృష్యమై తొమ్మిది రోజులైనా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కోసం అమ్మమ్మ, తాత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read also: Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి.. 15 గ్రామాల్లో హై అలర్ట్..
ఏం జరిగింది..
అదృష్యమైన విద్యార్థి స్వాతికి తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ.. తాత దగ్గర ఉంటుంది. స్వాతిని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ 4వ తరగతి చదువుకుంటుంది. ఈనెల 22న సాయంత్రం స్వాతి కిరాణం షాపకు వెళ్లింది. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అమ్మమ్మ, తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాండూర్ బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో బాలిక దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రత్యేక బృందాలతో స్వాతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
స్వాతి తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఎస్ పి సందర్శించారు. స్వాతి జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులుగా స్వాతి ఆచూకీ తెలియడం లేదని అన్నారు. స్వాతినే ఇంటి నుంచి వెళ్లిపోయిందా? లేక స్వాతిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే స్వాతి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు.
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫైర్..