డిజిటల్ మీడియా నియంత్రణపై కేంద్రానిది సరైన నిర్ణయమే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. “సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో పోస్టులు పెట్టడం…. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం…. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు పెట్టడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. మన దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చడం, అత్యాచారాలు వంటి పలు రకాల నేరాలను ప్రేరేపించే ఏవైనా సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినపుడు, వాటిని ముందుగా పోస్ట్ చేసినవారి వివరాలు చెప్పాలని, శాంతిభద్రతలను దెబ్బతీసే పోస్ట్‌ల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కొత్త డిజిటల్ రూల్స్‌లో ఉందని మంత్రి విపులంగా చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని విమర్శిస్తున్నవారికి ఇదే సోషల్ మీడియా కంపెనీలపై మన పొరుగుదేశం చైనా ఏ విధంగా ఉక్కుపాదం మోపిందో… తన స్వంత సోషల్ మీడియా సైట్లను మాత్రమే ఉపయోగించేలా ఆ ప్రభుత్వం ఎలా కట్టడి చేసిందో తెలియదా? దీని గురించి ఒక్కరూ మాట్లాడరు. భావప్రకటన స్వేచ్ఛ మన దేశంలో ఉన్నంతగా మరెక్కడా లేదన్నది నిర్వివాదాంశం. దేశ భద్రత విషయంలో కూడా రాజీ పడేలా కొన్ని వర్గాలు వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. నేను గతంలో ఎన్నోసార్లు ఈ మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలియజేశాను. సరైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.” విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!