తెలుగు భాషకు ఖ్యాతి తెచ్చారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నారాయణరెడ్డి స్మారక భవనాన్ని తక్షణమే నిర్మించాలని ఖైరతాబాద్ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకురాలు విజయ రెడ్డి డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ప్రభుత్వం ఆయన పేరున కేటాయించిన స్థలంలో జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం రెండేళ్ల క్రితం సినారె జ్ఞాపకార్థం కేటాయించిన స్థలంలో ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టకపోవడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే అధికారులు ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టలేదని విజయరెడ్డి విమర్శించారు. నిర్ణీత సమయంలో నిర్మాణాలు చేపట్టకపోవడంతో సదరు భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ భూమిని కబ్జా చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే నిర్మాణాలు ప్రారంభించక పోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని విజయారెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ కార్పోరేటర్ గా గెలిచిన విజయారెడ్డి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తన తండ్రి పనిచేసిన పార్టీలో తాను చేరానని ప్రకటించారు.
Jyotiraditya Scindia: నేడు, రేపు నియోజక వర్గ కార్యక్రమాల్లో సింథియా