Site icon NTV Telugu

Vijaya Ramana Rao : 2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలి

Vijaya Ramana Rao

Vijaya Ramana Rao

కేటీఆర్, హరీష్ రావు బావ బామ్మర్దులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు అన్నారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇంజనీర్లు కాదని, రైతు రుణమాఫీ అనేది చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎవ్వరు ఎంత పెద్ద మొత్తంలో ఋణమాపి చేయలేదని, రుణమాఫీ చేసిన చరిత్ర బీఆర్ఎస్‌కు లేదన్నారు. 2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని, హెల్ప్ లైన్ పెట్టుకొని రికార్డులు తెప్పించుకోవాలన్నారు విజయ రమణా రావు అన్నారు. గంగుల కమలాకర్ మంత్రి గా పని చేసి, ఇప్పుడు ఎంఎంఏ గా ఉండు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతుండని, నీళ్ల మీద ఆయనకు అవగాహన ఉందో తెలియకుండా ఉండన్నారు.

 Vishnu Priya: రీతూ జీవితంలోకి వచ్చాక పొట్ట పెరిగింది.. విష్ణు ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

అంతేకాకుండా..’ గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసింది ఏమి లేదు. NSA నిపుణులు అన్నారం,మెడిగడ్డ, సుందిళ్ళ లో నీళ్లు స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు షిప్ట్ చేయాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగిలింది.బుంగలు పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నే. ఎన్నికల సమయంలో తొలి నీళ్లు పెద్దపల్లి ని ముద్దాడుతాయి అన్నారు. మామ అల్లుళ్ళను ముద్దాడినవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పొట్టగొట్టిండ్రు. కేసీఆర్ హాయంలో ఎక్కడ కొత్త ఆయకట్టు రాలేదు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు లను నింపుకొని లక్ష కోట్లు దోచుకుండ్రు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టు లు కట్టింది. ఎక్కడైనా పగుళ్లు వచ్చాయా. ఆగస్టు 15 లోపు srsp ప్రాజెక్టు కూడా నిడుతుంది. బీఆర్ఎస్ నాయకుల పుట్టకే అపద్దాల పుట్టక. ‘ అని ఆయన అన్నారు.

MK Stalin: కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్‌పై సీఎం స్టాలిక్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version