తెలంగాణ రాష్ట్రం వచ్చినా నిరుద్యోగులు,రైతుల ఆత్మహత్యలు ఆగలేదని వీహెచ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే బాధగా ఉందన్నారు. కొట్లాడి న్యాయం జరిగేవరకు సాధించుకుందాం..ఆత్మహత్యలు ఆపండి అంటూ వీహెచ్ కోరారు.
Read Also: శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలి: జీవన్‌రెడ్డి
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు: కోదండ రెడ్డి..ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు. రైతుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ లేదన్నారు. రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా వుండేవారన్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు..రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. మా మౌన దీక్షతో అయినా ప్రభుత్వంలో చలనం రావాలని కోరుకుంటున్నా అని కోదండ రెడ్డి అన్నారు.
