కరోనా పంజా.. వేములవాడ రాజన్న ఆలయం మూత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు.. స్వామివారి నిత్య పూజలు, సీతారాముల కళ్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అంటే.. ఈ కార్యక్రమాలకు భక్తులను ఎవ్వరినీ అనుమతించబోరన్నమాట. కాగా, వేములవాడ రాజన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.. కోడులు ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!