రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాలు కూడా తోడవడంతో గత 10 రోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. గత 23 రోజులుగా హుండీ కౌంటింగ్ జరగకపోవడంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోయాయి. ఈనెల 10న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసిన వెంటనే, ఇన్చార్జి ఈవో రమాదేవి వెళ్ళిపోవడంతో హుండీలను లెక్కించలేదు. ప్రధానాలయం తో పాటు బద్ది పోచమ్మ దేవాలయంలో కూడా హుండీలు నిండిపోయాయి.
ఆలయంలో నిండిన హుండీలను సీల్ చేసి పక్కన పెట్టి చేతులు దులుపుకున్నారు. రాజన్న ఆలయంలో పాటు అనుబంధ ఆలయాలతో కలిపి మొత్తం 37 హుండీలు ఉండగా ప్రతిసారి సగం హుండీలను మాత్రమే లెక్కిస్తున్నారు. శ్రీరామనవమి తర్వాత 14 రోజులైనా ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడంతో హుండీ కౌంటింగ్ జరుగలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి పర్మనెంట్ ఈఓ ను నియమించి, కనీసం దేవాలయ పనులైనా సక్రమంగా చూడాల్సిన బాధ్యత ఉందంటున్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తారో చూడాలి.
Read Also: Acharya : హిందీ వెర్షన్ ఇప్పట్లో లేనట్టే !