Varahi in Kondagattu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టులో జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్న పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే వారాహి వాహనం కొండగట్టు చేరుకోగా.. మరికాసేపట్లో అంజన్న సన్నిధికి చేరుకోనున్నారు జనసేనాని..
కొండగట్టు చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు.. అయితే, పవన్ వస్తున్నారన్న సమాచారంతో.. ముందే పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. దీంతో.. తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు పవన్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు.. ఆయనకు ఆలయ అర్చకులు.. సిబ్బంది స్వాగతం తెలిపారు.. ఇక, అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్
కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనకు స్వాగతం తెలిపారు ఆలయ అర్చకులు.. సిబ్బంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు చేరుకున్నారు.. ముందుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత జనసేన ఎన్నికల రథం వారాహి వాహనానికి పూజలు చేయించనున్నారు.
జనసేన ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి' ప్రత్యేక పూజకు సర్వం సిద్ధం అయ్యింది.. దీని కోసం హైదరాబాద్ నుంచి కొండగట్టు బయల్దేరి వెళ్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అయితే.. మార్గమధ్యలో ఆయన గజమాలలతో స్వాగతం పలికారు అభిమానులు.. తమ అభిమాన నటుడు, నేతపై పూల వర్షం కురిపించారు. .
హైదరాబాద్ నుంచి కొండగట్ట అంజన్న ఆలయానికి బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్.. హకీంపేట్‌లో కాసేపు ట్రాఫిక్ లో చిక్కుకుంది.. రోడ్డుపై లారీ రిపేర్ కావడంతో హకీంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. అదే సమయంలో కొండగట్టు వెళ్తున్న పవన్.. కాసేపు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. పవన్ కాన్వాయ్ ని పంపించారు..
జన సేనాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. కొండగట్టుతో పాటు ధర్మపురి క్షేత్రాన్ని కూడా సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. దీంతో.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథానికి పూజలు చేయిస్తారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అవుతారు.. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్ కల్యాన్.. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
కొండగట్టు ఆంజనేయస్వామి చెంత జనసేన ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పడే వారాహి కొండగట్టు చేరుకోగా.. మరికాసేపట్లో కొండగట్టుకు రాబోతోన్నారు పవన్..