Site icon NTV Telugu

కేబినెట్‌: కొత్త జోన్లు, జిల్లాలవారీగా ఉద్యోగుల విభ‌జ‌న‌, ఖాళీల గుర్తింపు..!

KCR

KCR

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం ప‌డుతుంద‌ని కేబినెట్ అభిప్రాయ‌ప‌డింది.. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతుంద‌ని.. కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. దీంతో.. ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి.. వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది కేబినెట్‌.

Exit mobile version