NTV Telugu Site icon

V Hanumantha Rao: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది

Vh On Kcr

Vh On Kcr

V Hanumantha Rao Says KCR Govt Failed To Do Justice To Poor: పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫమైందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. నాగర్ కర్నూల్ సభలో ధరణికి సంబంధించి బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ధరణి కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో.. 1981 ఇందిరాగాంధీ నేతృత్వంలో రాజ్ కృష్ణారెడ్డికి సంబంధించిన 500 భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అయితే.. ఆ భూమి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నందున, ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకొని రాజ్ కృష్ణారెడ్డి కోడళ్ల పేర్ల మీదకు తిరిగి భూములను మార్చుకున్నారని పేర్కొన్నారు.

Mahi V Raghava : ఆ డైరెక్టర్ అంత వైలెంట్ గా ఎందుకు థింక్ చేసాడు…?

అంతేకాకుండా.. నిరుపేదలకు పంచిన భూములను అక్రమంగా లాక్కునే క్రమంలో, రెవిన్యూ అధికారులు సైతం వారి పేర్ల మీదకు మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ.. వారిపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని వీహెచ్ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను తెలుసుకొని, ఆ తర్వాతే ధరణి గురించి మాట్లాడాలని కేసీఆర్‌కు సూచించారు. ధరణి వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదు కాబట్టే.. ధరణిని రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరపున గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు. కానీ.. ఇప్పటికీ దానిపై స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధనవంతులకు లబ్ది చేసేందుకే ధరణి రాష్ట్రంలో అమలవుతోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భర్త చనిపోయిన భార్యలకు రావాల్సిన హక్కులను కేసీఆర్ సర్కార్ కాలరాస్తోందని దుయ్యబట్టారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరిలో అర్హులైన లబ్దిదారులకు మొండి చేయి చూపించి.. తమ పార్టీ కార్యకర్తలకు, డబ్బున్న ధనవంతులకు కట్టాబేడుతున్నారని ఆరోపణలు చేశారు. కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల్లోకి వచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Ice Cream: నోరూరిస్తున్న ఫ్రైడ్ ఐస్ క్రీం.. వైరల్ అవుతున్న వెరైటీ రెసిపీ

అంతకుముందు కూడా.. దళిత బంధు పథకంలో కమీషన్ తీసుకోవడం లేదని నిరూపిస్తే, తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమని వీహెచ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాల్లో లంచం ఇచ్చిన వారికే లబ్ది చేకూరుతోందని ఆరోపించారు. తమది రైతుల పక్షపాత ప్రభుత్వమని.. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతోందని అన్నారు. కిసాన్ సర్కార్ అంటూ ఊదరగొడుతున్నారని.. స్వరాష్ట్రమైన తెలంగాణలో రైతుల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఆకర్షణీయ పథకాలు ముందు పెట్టి.. అవినీతికి పాల్పడుతోందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.