Uttam Kumar Reddy: పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
Read also: Cyclone Michuang: ఆత్మకూరు బస్టాండ్‌లో మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న అధికారులు!
ఈ భేటీ అనంతరం లోక్ సభ స్పీకర్ ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉండగా, ఈరోజు సాయంత్రం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో ఈ సాయంత్రానికి సస్పెన్స్‌కు తెరపడనుంది.
Read also: Trains Rush: సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్.. ప్రత్యేక రైళ్ల కోసం పెరుగుతున్న డిమాండ్
రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా హుజూర్ నగర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తానని, నల్గొండ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు చేస్తారనేది ఇంకా తెలియరాలేదు.
Animal: ఆల్ సెంటర్స్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది… ఇక లాభాలే