సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్‌గా డిజైన్ చేసాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. అనిమల్ సినిమా అన్ని సెంటర్స్‌లో హౌజ్ ఫుల్స్ బోర్డ్‌తో రన్ అవుతోంది. మొదటి రోజు కన్నా డే 2 , డే 3 ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సండేకి 356 కోట్ల మార్క్ ని రీచ్ అయిన అనిమల్ మూవీ మండేతో 400 కోట్లు గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది.
మొదటి వారం కంప్లీట్ అయ్యే సరికి అనిమల్ సినిమా 550 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. నార్త్ బెల్ట్ తో పాటు సౌత్ బెల్ట్ నుంచి కూడా అనిమల్ సినిమాకి సాలిడ్ కలెక్షన్ వస్తున్నాయి. ఈ కారణంగానే ఓవరాల్ గ్రాస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన అనిమల్ మూవీ… అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది. ఈరోజు నుంచి వచ్చేదంతా ప్రాఫిట్స్ లోకి వెళ్లిపోతుంది. హిందీలో జనవరి 25 వరకూ పెద్ద సినిమాలు లేవు కాబట్టి అనిమల్ మూవీ కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించే అవకాశం లేదు. 48.92 ఆకుపెన్సీని మైంటైన్ చేస్తున్న అనిమల్ సినిమా ఓవరాల్‌గా రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అనిమల్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు భారీ వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ.