Uttam Kumar Reddy: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారని అన్నారు. కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు పార్టీలో చేరికలు జరగాయన్నారు. శంకరమ్మ నా మీదనే పోటీ చేశారు.. కానీ ఎప్పుడూ పరస్పర గౌరవంతో ఉన్నామన్నారు. పార్టీలో బీసీ లకు.. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారంతో గెలవాలని చూస్తున్నారన్నారు. పదేళ్లు తెలంగాణ కి ఏమి చేయని మోడీ..అమిత్ షా లు మత విద్వేషాలు పెట్టి విభజించాలి అని చూస్తున్నారన్నారు. మోడీ దిగజారి మట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది బీజేపీ అజెండా అని మండిపడ్డారు. జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.
Read also: Sreleela : ఆ స్టార్ హీరో మూవీ ఆఫర్ వదులుకున్న శ్రీలల..?
కాంగ్రెస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవం..అబద్ధం.. ఆధాని..అంబానీ మోడీ వెంటనే ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు కాబట్టి..మోడీ..అమిత్ షా లు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆధాని..అంబానీ రాహుల్ గాంధీ తో దోస్తీ చేస్తే.. ఈడీ.. సీబీఐతో విచారణ జరిపించు మోడీ అంటూ ప్రశ్నించారు. భట్టి నాయకత్వంలో పవర్ సప్లై సక్రమంగా జరుగుతుందన్నారు. గతంలో కంటే మెరుగ్గా పవర్ సప్లై ఉందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 13 సీట్లు వస్తాయన్నారు. ఎన్నికలు కాగానే రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. క్రికెట్ టీం లాగా కలిసి కట్టుగా పని చేస్తున్నాం మేమని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్.. మేము రైతు బంధు వేయకపోతే… వేయలేదు అంటారన్నారు. రైతు బంధు వేస్తే.. ఆపండి ఆపండి అని ఆపించారని తెలిపారు. కేసీఆర్ ఏదైనా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్