Kishan Reddy: హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు పార్టీ కార్యకర్తలు.. యువత ఎల్బీ స్టేడియంకు రావాలన్నారు. మన ప్రియతమ ప్రధాని మోడీ సభలో పాల్గొంటారన్నారు. కార్యకర్తలు అందరూ తమ బూత్ లలో ప్రజలను అందరిని తీసుకురావాలన్నారు. తెలంగాణలో రేపటి సభతో మోడీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. ఎల్లుండి మహిళా మోర్చా తరుపున అందరు డోర్ టూ డోర్ ప్రచారం చేయాలన్నారు. విశ్వాసంతో ముందుకు వెళ్లాలి.. రోజు రోజుకు మన గ్రాఫ్ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సెకండ్ ప్లేస్ కోసం పోటీ జరుగుతుందన్నారు. బలం లేని నియోజకవర్గాల్లో కూడా మన బలం పెరుగుతుందన్నారు. సికింద్రాబాద్ లో కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్లాడుతున్నాయన్నారు. హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలని పిలుపునిచ్చారు.
Read also: Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి అనుకోకుండా సీఎం అయ్యారని నిన్న జరిగిన ప్రచారంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మాయమాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గాడిదలు గుడ్లు పెట్టవు కానీ రేవంత్ రెడ్డి గుడ్లు పెట్టాడు. ప్రతి బహిరంగ సభలో గాడిద గుడ్డుతో వస్తుంటే… రేవంత్ రెడ్డి పార్టీ గాడిద గుడ్డు పార్టీనా? అతని గుర్తు గాడిద గుడ్డనా? బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని జరుగుతున్న ప్రచారంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తొలగించబోమని ప్రధాని మోదీ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.
Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్