అరగంట ఆలస్యం అయిందని ఓ క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్‌ను చితకబాదిన ఘటనపై కొత్తకోణం వెలుగు చూసింది. దాడి చేసిన మరికొందరిని తప్పించడానికి వివిధ పార్టీల పెద్దలు రంగంలోకి దిగి రాయబారం చేస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్ దాడి అనంతరం వివేక్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడని, రాజేంద్రనగర్ పోలీసులు రెండ్రోజులు విచారించి సోమవారం తిరిగి రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన 12 మంది పేర్లను నిందితుడు వివేక్‌రెడ్డి చెప్పినట్లు తెలిపారు. అయితే సీసీ ఫుటేజీలో సుమారు 20 మంది వరకు దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాడిలో కొన్ని పుటేజీలను పోలీసులకు దొరక్కుండా చూస్తున్నారని బాదితులు ఆరోపిస్తున్నారు.
వెంకటేశ్ తల్లి దండ్రులు మాట్లాడుతూ.. తన కొడుకు డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. తన కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడని, అంతా బాగుంటే, ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడని, ఇంతలోనే పరీక్ష రాయాల్సిన తన కొడుకు, ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తన కొడుకు వెంకటేశ్ కు చికిత్స కోసం ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చయిందని, ఆర్థికంగా భారమవడంతో సోమవారం మరో ఆసుపత్రికి మార్చామని కుటుంబసభ్యులు వాపోయారు. మరో బాధితుడు పర్వతాలు కోలుకుంటున్నట్లు తెలిపారు.
read also: Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
ఉప్పర్ పల్లి కి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రాఫిక్ ప్రభావమో లేక, ఏ ఇతర కారణమో ఓలా క్యాబ్ డ్రైవర్ ఆర గంట ఆలస్యంగా వచ్చాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ ను వినయ్ రెడ్డి నిలదీసాడు. ఇద్దరి మద్య మాటా మాటా పెరగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో.. వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా డ్రైవర్ పై దాడి చేసారు. తీవ్రంగా కొట్టారు. దీంతో క్యాబ్ డ్రైవర్ దాడి విషయాన్ని క్యాబ్ యజమానికి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యజమాని హుటాహుటిన ఉప్పర్ పల్లి కి చేరుకుని వినయ్ రెడ్డి తో వాగ్వాదానికి దిగాడు. ఇలా దాడికి దిగడం సరైన పద్దతి కాదని తెలిపారు. దీంతో వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా యజమానిని సైతం చితకబాదారు. ఉదయం 4 గంటల వరకు ఓ రూమ్ లో బంధించి దాడి చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటనలో నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అధికారులు నిందితులను నిజంగానే తప్పించే ప్రయత్నం చేస్తున్నారా.. లేక బాధితులతో మంతనాలు చేసేందుకు యత్నం చేస్తున్నారా అనే ఆరోపణలు వస్తున్నా. అరగంట ఆలస్యం రావడంతో క్యాబ్ డ్రైవర్ పై దాడి చేయడం, విచక్షణా రహితంగా కొట్టడం మృగాల్ల ప్రవర్తించారని ప్రజలు అంటున్నారు. మరి ఇటాంటి ఘటనలు జరగకుండా నిందితులపై కఠిచర్యలు తీసుకోవాలని, బాధితుడి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.