NTV Telugu Site icon

Kishan Reddy: ఇప్పటి వరకు అగ్ని ప్రమాదాలైన బిల్డింగ్‌ లన్నీ అక్రమ కట్టడాలే

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు. అక్రమ కట్టడాలను బడ్జెట్ కోసం రెగ్యులరైజ్ చేస్తుంది ప్రభుత్వం అంటూ ఆరోపించారు. ఇలాంటి అక్రమ కట్టడాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవనం చుట్టూ ఉన్న బస్తీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన వారికి తగు పరిహారం చెల్లించాలని డామండ్‌ చేశారు.

Read also: Brij Bhushan: ‘కుట్రను బయటపెడతా..రెజ్లర్ల ఆరోపణలు అవాస్తవం’

ఇలాంటి అగ్ని ప్రమాదాల కారణంగా గతంలో చాలా మంది చనిపోయారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇలా.. జనావాసాల మధ్య గోడౌన్లు, వేర్ హౌస్ లు ఉన్నాయన్నారు. ఇక వీటన్నింటిపై సర్వేలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే.. నిన్న డెక్కన్ నైట్ వేర్ భవనంలో పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇది ఇంకా ఈ భవనంలో ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రమాద తీవ్రత తెలియదని అభిప్రాయపడ్డారు. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లోని భవనం సెల్లార్ లో ఇంకా మంటలున్నాయన్నారు. అయితే.. ప్రమాదంలో ఎలాంటి ప్రాణపాయం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్టుగా మంత్రి చెప్పారు. ఇక జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని పట్టణాల్లో ఈ రకమైన గోడౌన్లలో తనిఖీలు చేయాలని కోరారు. అగ్నిప్రమాదం సంభవించడంతో.. భవనం పక్కనే ఉన్న ఇళ్లు కూడా దగ్దమయ్యాయన్నారు.

Read also: Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..

ఇలా.. జనావాసాల మధ్య ప్రమాదం జరగడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని.. జనావాసాల మధ్య ఉన్న గోడౌన్లు, స్టోర్స్ వెంటనే ఖాళీ చేయించి సిటీకి దూరంగా ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అక్రమంగా నిర్మించిన గోడౌన్లు, స్టోర్స్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా.. ఆదాయం కోసం అక్రమంగా రెగ్యులరైజ్ చేయడం వల్లే ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించిన కిషన్‌ రెడ్డి గతంలో ఈ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాలన్నీ కూడా అక్రమంగా నిర్మించిన భవనాల్లో జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. అగ్ని ప్రమాదానికి గురైన భవనం కూల్చివేసే సమయంలో పక్కన ఉన్న భవనాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని.. అగ్ని ప్రమాదం జరిగిన పక్క కాలనీలో నివాసం ఉంటున్న వారికి తమ పార్టీ తరపున భోజన వసతి కల్పించనున్నట్టుగా మంత్రి చెప్పారు. మరో వైపు ఈ కాలనీ వాసులకు ఇళ్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్