Site icon NTV Telugu

Kishan Reddy : రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. కేంద్రంపై టీఆర్‌ఎస్‌ సమర శంఖం పూరించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ నేతలు నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పుడు బియ్యంగా మార్చకుండా కేంద్రానికి బియ్యం ఇయ్యండని, నూకల చార్జీ మీరు భరించండి.. నూకల వల్ల వచ్చే నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా.. నూకల వల్ల చాలా తక్కువ నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆయన ఆయన వ్యాఖ్యానించారు.

రైతుల విషయంలో రాజకీయం ఎందుకు అంటూ ఆయన హితవు పలికారు. టీఆర్‌ఎస్ కేంద్రంపై చేసే దుష్ప్రచారాలను రైతులు నమ్మలేదంటూ.. కేసీఆర్ మాట్లాడిన వీడియోలను కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో చూపించారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, కేంద్రానికి అగ్రిమెంట్ ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రం సేకరించను అంటుందని ఆయన మండిపడ్డారు. రైతులను ఆగం చెయ్యటం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రా రైస్ చివరి గింజ వరకు కేంద్రం కొంటుందని, టార్గెట్ కంటే ఎక్కువ కొన్నామని, తెలంగాణకు ఒక విధానం, దేశానికి ఒక విధానము లేదని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం ఉందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇదే విధానము ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులను రెచ్చకొట్టటం కోసమే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండని, ధాన్యం సేకరణలో కేంద్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వెయ్యలేదని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ది రైతు దీక్ష కాదు, రాజకీయ ఆరాటం అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

https://ntvtelugu.com/bandi-sanjay-demanded-bc-reservations/

Exit mobile version