ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరుపున రూ. 8లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. అంతేకాకుండా సాయి గణేష్ కుటుంబానిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి గణేష్ ని తెచ్చి ఇవ్వలేక పోయాన అండగా ఉంటామన్నారు. సాయి గణేష్ మృతి చాలా దురదృష్టకరమని, ఇది నిజాం రాజ్యం కాదు…కుటుంబ రాజకీయాలు తెలంగాణ లో తెస్తామంటే ఒప్పు కోరన్నారు. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టారు అయినా ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించారు… ఈటల రాజేందర్ ను ప్రజలు గెలిపించారన్నారు.
నిజాంను కూల్చి వేసిన చరిత్ర చూశామని, అక్రమ కేసులు, రౌడీషీట్ తెరిపించి జైలుకు పంపితే కమ్యూనిస్టు లు పోయారు…అభివృద్ధి జరిగుద్ది అనుకున్నా.. తుమ్మల హాయాంలో రోడ్లు అభివృద్ధి జరిగాయి.. ఖమ్మంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాయి గణేష్ ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే టీఆర్ఎస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు. పోలీసులు లక్ష్మణ్ రేఖ దాట వద్దు. మీకు కష్టాలు వస్తే ఎవరు అండగా ఉండరన్నారు.