Site icon NTV Telugu

Anurag Thakur : తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

Anurag Tagore

Anurag Tagore

బీజేపీ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు, ప్రముఖ బీజేపీ నేతలు అందరూ తెలంగాణాకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే నిన్న కేంద్రమంత్రి అనురాగ్‌ థాకూర్ తెలంగాణకు చేరుకున్నారు. అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేం ఫామ్ హౌస్ లో ఉండే నేతలం కామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సామాన్యుడికి చేరువ అయ్యే నేతలం… జనాల గుండెల్లో ఉంటామంటూ ఆయన వెల్లడించారు. ప్రతీ గ్రామానికి చేరువ అవ్వాలి అనేదే మా ఉద్దేశం… అందుకే మేమంతా ప్రతీ నియోజకవర్గానికి వెళ్తున్నామని ఆయన తెలిపారు.

Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈరోజు… కేంద్ర మంత్రులు, సీనియర్ లీడర్లు సైతం.. సామాన్య కార్యకర్త మాదిరిగా.. ప్రతీ ఇంటికి చేరువ అవుతామని ఆయన పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోడీ.. నేడు పేదలు, సామాన్యుల అభివృద్ధి గురించి తపిస్తున్నారని ఆయన తెలిపారు. ఫామ్ హౌజ్ లో ఉండి పాలన నడిపించే వ్యవస్థ కాదు మాది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

Exit mobile version