NTV Telugu Site icon

Viral News : ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వీణా-వాణి

Veena Vani

Veena Vani

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నేడు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. అవిభక్త కవలలు వీణా-వాణి లు ప్రస్తుతం ఇంటర్‌లో సీఈసీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలలో వీణా-వాణిలు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సీఈసీలో వీణకు 712 మార్కులు రాగా, వాణి 707 మార్కులు సాధించింది. దాంతో, వీణా-వాణిల కుటుంబ సభ్యులు హర్షం వక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పిందిస్తూ.. వీణా-వాణిలను అభినందించారు. ఇదే రీతిలో ముందంజ వేయాలని శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్‌. అంతేకాకుండా వీరి విజయం మరొకరికి ఆదర్శంగా నిలువాలని.. ఎంతో మందికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.