Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీస్ వర్గాల వెల్లడించాయి. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపాయి. వైద్య పరీక్షల నివేదికల్లో విషపూరిత ద్రవపదార్థాల ఆధారాలు లేవని, కేవలం సింపతీ కోసమే ఆత్మహత్యాయత్నంగా తప్పుడు ప్రచారం చేసినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. సూసైడ్ నోట్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రైనీ IPS, 30 ఏళ్ల వివాహిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రైనీ IPS కి అసభ్యకర మెసేజ్‌లు పంపడమే కాకుండా.. ఆమె గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని కూడా ఆ ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆయన హెల్త్ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ వర్గాల వెల్లడించాయి. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపాయి. దీంతో ఆయన కేవలం సింపతీ కోసమే ఈ నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!