NTV Telugu Site icon

Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ

Komaram Bheem Loans

Komaram Bheem Loans

Komaram Bheem: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్‌లో గత రెండు నెలలుగా పులులు పలు ఆవులపై దాడి చేసి చంపిన ఘటనలు సంగతి తెలిసిందే.. అయితే ఆదివారం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దరిగాం అటవీ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా ఆ ప్రాంతం సమీపంలో మూడు సంవత్సరాల వయసు గల మరో పులి కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు. నేడు అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ సందర్శించారు.

Read also: Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్‌ స్కేల్‌పై 6.7 తీవ్రత!

దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర గాయాలపాలై ఓ పులి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి మృతిపై అటవీశాఖ అధికారులు ఆదివారం కాగజ్ నగర్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీసీఎఫ్ శాంత రాం మాట్లాడుతూ.. ఆశ్రయం కోసం రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో పెద్దపులి చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన దాదాపు ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని తెలిపారు. పులి చనిపోయిందని తెలియడంతో అధికారులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులికి పోస్ట్‌ రూట్‌ నిర్వహించి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. నివాసం కోసం రెండేళ్ల పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి చనిపోయిందని తెలిపారు. పులి మెడ, తలపై బలమైన గాయాలు ఉండడంతో రెండు పులుల మధ్య ఘర్షణ వల్లే చనిపోయి ఉంటుందని చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.
Brazil: బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి

Show comments