Site icon NTV Telugu

Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మృతి.. కొమురం భీంలో ఒకరు, మంచిర్యాలలో మరొకరు..

Sunstroke

Sunstroke

Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో వడదెబ్బ మృత్యువాత పడుతున్నవారు కూడా ఎక్కువవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

కొమురం భీం జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్.2 లో వడదెబ్బతో గుర్తుతెలియని వృద్దుడు మృతి. మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణం వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేష్ అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read also: Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి

వడదెబ్బకు తాజాగా ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీహార్‌కు చెందిన ఓ కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీహార్ కు చెందిన శంకర్ సదా అనే కూలీ పనిచేస్తున్నాడు. శుక్రవారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్‌ ఎస్‌ఐ మారుతి తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం లాం అడ్లూరు గ్రామానికి చెందిన బోడ అశ్రిత నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవల బంధువు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తన భార్య వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిందని అశ్రిత భర్త పేర్కొన్నాడు.
Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి

Exit mobile version