Accidents in Telangana: తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకోగా.. మరో ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ లో పడి 12 ఏళ్ల బాలుడు కార్తికేయ మృతి చెందాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా… బాల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడింది. దీంతో స్నేహితులు కార్తికేయను బాల్ తీసుకుని రావాలని కోరారు. నిన్న స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండగా.. గోడ దూకి వెళ్ళాడు.
Read also: ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. వంద రోజుల్లో 55 కి పైగా కేసులు
అయితే కార్తికేయ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో.. స్నేహితులు భయాందోళన చెందిన స్విమ్మింగ్ పూల్ గోడ ఎక్కి చూడగా.. కార్తికేయ స్విమ్మింగ్ పూల్ లో విగత జీవిగా కనిపించాడు. దీంతో కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు కార్తికే మృత దేహాన్ని బయటకు తీశారు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ కి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు సనత్ నగర్ పోలీసులు తెలిపారు.
Read also: Madhuri Dixit: 50ప్లస్ లో కూడా మాధురి అందానికి ఫిదా ఆవలిసిందే…
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దూర్ గ్రామంలో మరోఘటన చోటుచేసుకుంది. అలీఫా అనే ఏడాదిన్నర చిన్నారి స్కూలు వ్యాన్ కిందపడి మృతి చెందింది. తన అన్నయ్య స్కూలు వ్యాన్ ఎక్కుతుండగా అన్నయ్య కోసం వచ్చిన ఆ చిట్టి తల్లి స్కూలు వ్యాన్ కింద పడింది. అయితే డ్రైవర్ చిన్నారిని గమనించలేదు. స్కూలు వ్యాన్ ముందుకు తీయగానే చిన్నిరి తలపై టైరు ఎక్కింది దీంతో అలీఫా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
UTS Ticket: కౌంటర్ దగ్గర రద్దీ దృష్ట్యా టికెట్ తీసుకోవడానికి మరో ‘యాప్’..!
