Telangana Floods : హైదరాబాద్‌కు నీటి వనరులైన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగింది. అధికంగా వచ్చిన నీటిని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌లో ప్రస్తుతం సెకనుకు 6 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 11 గేట్లు తెరిచి 7,986 క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే, హిమాయత్ సాగర్‌కు సెకనుకు 7,500 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో నమోదు కాగా, ఆరు గేట్లు ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడిచారు. ఈ విధంగా రెండు జలాశయాల నుంచి కలిపి దాదాపు 14 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం మూసిలోకి చేరుతోంది.
Craigslist Success Story: ‘కోట్లు సంపాదిస్తున్న వెబ్‌సైట్’.. ఏంటీ దీని ప్రత్యేక!
దీంతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ కింద నివసిస్తున్న 55 మందిని జిహెచ్ఎంసి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జంట జలాశయాలకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద ఉధృతి పెరగవచ్చని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
