NTV Telugu Site icon

Tummala Nageswara Rao : పంట నష్ట పోయినప్పుడు ఏనాడైన రైతులను ఆదుకున్నారా..!

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Tummala Nageswara Rao : పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులు ఈ రోజు బీఆర్‌ఎస్‌ నాయకులకు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు నాట్లు వేసేటప్పుడు ఇచ్చాం అంటున్న వారికి, ప్రతి పంట కాలములో రైతుబంధు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పటిదాకా ఇచ్చారో తెలియకపోతే ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. రైతుబంధు పేరు చెప్పి పంటల భీమా, వ్యవసాయ యాంత్రికరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది ఏవరు.? అని ఆయన అన్నారు.

RG Kar Case Verdict: కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..

అంతేకాకుండా.. పంట నష్ట పోయినపుడు ఏనాడైన రైతులను ఆదుకున్నారా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ మధ్యకాలంలో చేస్తున్న రైతు దీక్షల పేరిట చేస్తున్న కొత్త విన్యాసాలు , అక్కడ వారు చేస్తున్న ప్రకటనలు చూసి తెలంగాణ రైతాంగం నవ్వుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పదేళ్లలో వారి ప్రభుత్వంలో జరిగినట్టు చెప్పుకుంటున్న అభివృద్ధికి, ప్రస్తుత సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలను మరొక్కసారి వారికి గుర్తుచేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Breaking News: హైదరాబాద్‌ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు