TSRTC New Rule: కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్ గురూ.. ఈనెల 27 నుంచే అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC New Rule: టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశంలో తొలిసారిగా విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని ప్రభుత్వ రంగంలో అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. ఈనెల 27వ తేదీ నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానంలో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది. అంతేకాకుండా.. సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. అయితే.. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. ఇదే కాదండోయ్ ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఎక్కువ ధర ఉంటుంది. అంటే.. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఇక.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.
Read also: Rohit Sharma : వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లొద్దా..?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అయితే.. ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజులకు పెంచింది. ప్రయాణించే వారి అవసరాలకు అనుగుణంగా ప్రారంభించిన కార్గో, డిజిటల్ సేవలు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. అయితే.. కార్గో సేవలపై కొన్ని విమర్శలు వస్తున్న క్రమంలో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక, వరంగల్ కళాశాలలో హుందాగా ప్రవర్తించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు. దీంతో.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక.. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు ఛార్జీల్లో మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని నూతన పద్ధతులు తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
దేశంలోనే ప్రజా రవాణా వ్యవస్థలో మొదటిసారిగా 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని ఈ నెల 27 నుంచి #TSRTC అమలు చేయనుంది. సంస్థ ఏ కొత్త కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని కూడా అలానే ప్రోత్సహిస్తారని సంస్థ ఆశిస్తోంది. @TSRTCHQ pic.twitter.com/85HP1ljBJT
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 24, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు