Site icon NTV Telugu

RTC MD Sajjanar: 1930 నంబర్‌కు కాల్ చేయండి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటన..

Sajjanar

Sajjanar

RTC MD Sajjanar: రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను పెట్టుబడిగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో తెలంగాణ ముందంజలో ఉంది. సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 15 వేల 297 కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు? ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నేరాలు ఆగడం లేదు. సైబర్ నేరాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. OTP, OLX ఇలా రకరకాలుగా ప్రజలను మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read also: KKR vs SRH Qualifier 1: స్టార్ ఓపెనర్ దూరం.. హైదరాబాద్‌తో తలపడే కోల్‌కతా తుది జట్టు ఇదే!

కేటుగాళ్లు FedEx కొరియర్ కంపెనీ నుండి కాల్ చేస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌తో కూడిన పార్శిల్ వచ్చిందని, అందులో స్మగ్లింగ్ డ్రగ్స్ పట్టుబడ్డాయని భయాందోళనకు గురవుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పి కేసుల నుంచి తప్పించుకునేందుకు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇలా అడిగే నేరగాళ్లకు ఏం చేయాలో తెలియక కొందరు అయోమయంలో పడ్డారు. తీరా జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి, అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కొనాలని సూచించారు. FedEx పార్శిల్స్ పేరుతో మోసపూరిత కాల్‌లను నమ్మవద్దని, పోలీసులమని చెబితే డబ్బులు ఇవ్వొద్దని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. మీకు కూడా అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. మనం తప్పు చేయనంత కాలం ఆందోళన చెందాల్సిన పని లేదు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను 1930 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
Churidar Gang: నగరంలో చుడీదార్‌ గ్యాంగ్‌ హల్ చల్.. వీడియో వైరల్..

Exit mobile version