TSRTC Bus Tickets: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టీ-24 టికెట్లలో భారీ డిస్కౌంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Bus Tickets: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టిక్కెట్లపై భారీ తగ్గింపును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక.. హైదరాబాద్ నగరంలో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణానికి టీ-24 టికెట్ రూ.లకే ఇవ్వాలని నిర్ణయించారు. 75.. అదే T-24 టిక్కెట్టు పిల్లలకు కేవలం రూ. 50. అయితే, ఈ తగ్గింపులు ఆగస్టు పదిహేనవ తేదీన మాత్రమే చెల్లుబాటు అవుతాయని TSRTC యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం టి-24 టిక్కెట్టు సాధారణ ప్రయాణికులకు రూ.120, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉంది. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందిస్తున్న రాయితీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
Read also: Traffic Diversions: పంద్రాగస్టు రోజున ట్రాఫిక్ ఆంక్షలు.. గోల్కొండకు వెళ్లే వారికి సూచనలు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని, 60 ఏళ్లు పైబడిన మహిళ, పురుష సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు వయస్సు నిర్ధారణ కోసం వారు తమ ఆధార్ కార్డును బస్సు కండక్టర్‌కు చూపించాలి. .అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రయాణిస్తున్నారు.పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఆ రోజు పర్యాటక ప్రాంతాలు, పార్కులు బాగా రద్దీగా ఉంటాయి.ఈ నేపథ్యంలోనే సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. T-24 టికెట్.. పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.50 టిక్కెట్టు ఇస్తున్నారు.ఈ డిస్కౌంట్లు ఈ నెల 15వ తేదీన ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ప్రజలు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి నగరంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 3 గంటల పాటు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు ఉండవు
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!