TSRTC Bus Passes Price Also Hiked.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇటీవలే బస్సు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బస్సు చార్జీలేకాకుండా విద్యుత్ చార్జీలు సైతం పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి పెరిగిన చార్జీలు వర్తిస్తాయి. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ మరో బాదుడుకు సిద్ధమవుతోంది. బస్సు టిక్కెట్లపైనే కాకుండా… ఇప్పటు బస్ పాస్‌ల ధరలు కూడా పెరిగేలా కనిపిస్తోంది. కానీ.. విద్యార్థుల బస్ పాస్‌ల ధరలు మాత్రం పెంచకపోవడం విశేషం.
అయితే టీఎస్‌ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ రూ.950 లు ఉండగా అవి రూ.1150కి, ఎక్స్‌ప్రెస్ రూ.1070 నుంచి రూ.1300, డీలక్స్ రూ.1185 నుంచి రూ.1450, ఏసీ బస్సు రూ.2500 నుంచి రూ.3000 వరకు, ఎన్జీవో ఆర్డినరీ రూ.320 నుంచి రూ.400లకు, ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ రూ.450 నుంచి రూ.550కి, అలాగే ఎన్జీవో డీలక్స్ పాస్ రూ.575 నుంచి 700 లకు పెంచుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
