ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఆర్థిక శాఖ మొదటి విడుత క్రింద 30,543 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులకు తీపికబురు చెబుతూ.. పలు సూచనలు చేసింది. అవేంటంటే.. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు.. దీనికోసం వెంటనే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు కొత్త జోనల్ విధానం ప్రకారం అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా ఒకటో తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన వివరాలను పొందు పర్చండని తెలిపింది. చివరి వరకు ఆగి తప్పులు చేయకండని అభ్యర్థులకు టీఎస్పీఎస్సి సూచనలు చేసింది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఉద్యోగ వేటలో ఉంటే.. మీ వివరాలను అప్డేట్ చేసుకోండి.
