ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి వరుసగా శుభవార్తలు చెబుతూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. కొన్ని టెస్ట్‌లు కూడా జరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ).. ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న వేళ.. మరో 207 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది… వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులతో పాటు.. హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ..
Read Also: Heavy snowfall in America : అమెరికాలో భారీ హిమపాతం.. 2270విమాన సర్వీసులు రద్దు
ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు.. వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో 185 అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.. ఇక, 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 2023 జనవరి 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు స్పష్టం చేశారు.. అయితే, దరఖాస్తు తేదీల పొడిగింపు ఉండబోదని, అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. నోటిఫికేషన్లు, అర్హతలు, దరఖాస్తులు.. ఇలా రెండు నోటిఫికేషన్లు సంబంధించిన పూర్తి వివరాలు https://www. tspsc. gov.inలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.