TSRTC: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సు ఎక్కిన వారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 3 గంటల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చే పుష్పక్ బస్సులు కొన్ని ప్రధాన ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇతర బస్సులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిటీ బస్సుల్లో ఈ సౌకర్యం కల్పించినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఎయిర్ పోర్టు స్టాప్ లో టికెట్ కొన్న వారికే వర్తిస్తుందని చెబుతున్నారు. మధ్యలో బస్సు ఎక్కిన వారికి ఈ ఆఫర్ వర్తించదని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కూడా ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. వరుస సెలవుల నేపథ్యంలో దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సంస్థ హైదరాబాద్ నుండి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్‌సైట్ http://tsrtconline.inలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 TSRTC కాల్ సెంటర్ నంబర్‌లను సంప్రదించాలని TSRTC అధికారులు వెల్లడించారు.
Read also: Fire Aciident: చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌లో చేలరేగిన మంటలు..
హైదరాబాద్ మెట్రో రైల్ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చి రూ.59తో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ నెల 12, 13, 15 తేదీల్లో మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఆ రోజుల్లో రూ. 59 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ జర్నీ చేయవచ్చని వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 11, 2023
Heavy Rain in Hyderabad: మరోసారి కమ్ముకున్న మబ్బులు.. నగరంలో కుమ్మేస్తున్న వానలు