తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అంటూ అభివర్ణించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు జరుగుతాయి.. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల వల్లే దేశం బాగుందన్నారు.. వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోందన్న కవిత.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యోగులు ఆ రోజు త్యాగాలు చేశారు.. తెలంగాణ ఉద్యోగులతో కేసీఆర్‌కు ఉన్నది తల్లి పేగు బంధంగా అభివర్ణించారు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు కేసిఆర్.. దేశంలో ఇస్తున్న అవార్డులు ఫస్ట్ మూడు అవార్డులు తెలంగాణకు వస్తున్నాయి.. కేసీఆర్ గన్ అయితే.. బుల్లెట్లు ప్రభుత్వ ఉద్యోగులు అని పేర్కొన్నారు.
Read Also: Temple Collapses: ఉత్తరఖండ్ లో కూలిన ఆలయం.. సురక్షిత ప్రాంతాలకు 60కుటుంబాలు
ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఉద్యోగుల కష్టం ఉంది.. పీఆర్సీ లాంటి విషయాలు చెప్పుకోవాల్సిందే అన్నారు కవిత.. ఇది మన కుటుంబ సమస్య, సమస్య చెప్పకపోతే నన్ను దూరం చేసినట్టు అవుతుందని.. కచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అన్నారు.. మనమేమో ఉద్యోగుల కోసం పాటు పడుతుంటే.. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉద్యోగులు గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఉద్యోగులు కేసీఆర్ బంధువులుగా పేర్కొన్న కవిత.. కొత్త ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే మా వెనక జెండా పట్టుకోవడానికి లేరని బాధ పడుతున్నారని మండిపడ్డారు. రేపటి రోజు దేశం మొత్తం తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుతుంది.. బీహెచ్‌ఈఎల్, సింగరేణి లాంటివి బతికింది అంటె తెలంగాణ వల్లేనన్నారు ఎమ్మెల్సీ కవిత..
