Site icon NTV Telugu

Kadiyam Srihari: మోడీ ఇక చాలు.. మాకు తెలంగాణ మోడల్‌ కావాలి..!

Kadiyam

Kadiyam

తెలంగాణ మోడల్.. గుజరాత్‌ మోడల్‌ను తలదన్నేలా ఉంది… మోడీ ఇక చాలు.. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. మేం తెలంగాణ మోడల్ ను ప్రచారం చేసుకోలేదు.. కానీ, గుజరాత్ మోడల్ అంటూ మోడీ బాగా పబ్లిసిటీ చేసుకున్నారన్న ఆయన.. తెలంగాణ మోడల్‌.. గుజరాత్‌ను తలదన్నేసిందన్నారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు కడియం.. దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని ఫైర్‌ అయిన కడియం.. తిరోగమన దిశగా భారత దేశం వెళ్లోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Telangana Assembly Sessions 2022: ఈటెల సస్పెన్షన్‌ వేటు.. ఎప్పటివరకు అంటే..

కేంద్ర సర్కార్ అన్ని పరిశ్రమలను ప్రైవేటుకు అమ్ముకోవాలని చూస్తోంది.. 16 కోట్ల ఉద్యోగాలు కేంద్రంలో రావాల్సి ఉండగా 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కడియం శ్రీహరి.. రిజర్వేషన్లు పోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తోంది. దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.. ఉచితాలు వద్దని మోడీ అంటున్నారు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన సమానత్వం వచ్చిందా? అని ప్రశ్నించారు. పేద వర్గాలపై, మైనార్టీలపై, బడుగు బలహీన వర్గాలపై మోడీకి, బీజేపీకి కోపం ఉందన్న ఆయన.. సమాజం నుంచి వెలివేయాలని, దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అంటే వారికి పడదన్నారు. మేం భారతీయులం కాదా..? మేం లేకుండానే భారత దేశం ఏర్పడిందా? అంటూ నిలదీశారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది. దాన్ని నిలువరించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు.. 12 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర పెద్దలు మాఫీ చేశారు.. నీ అయ్యా జాగీరా, నీ తాత సొమ్మా, సిగ్గుండాలి అంటూ విరుచుకుపడ్డారు. 8 ఏళ్లలో మోడీ ఎన్నో వేషాలు వేశారు.. అవన్నీ ప్రజలను మోసం చేయడానికే అని విమర్శించారు కడియం శ్రీహరి.

Exit mobile version