దక్షణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ సర్కార్ వివక్ష చూపుతుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఇక, ఉత్తరాది వారి పెత్తనం దక్షిణాదిపై ఎక్కువగా ఉందని.. అసలు వారి పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా… ఆర్థికాభివృద్ధి, జనాభా నియంత్రణలో దక్షణాది రాష్ట్రాలు ఉంటే.. కేవలం జనాభా పెంచడంపైనా ఉత్తరాధి రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయని విమర్శించారు.. ఏపీ పునర్:వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు పడ్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు.. జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరుగుతున్నా.. తెలంగాణ-ఏపీలను పట్టించుకోట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ‘అరసవల్లి’ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. 10 రోజుల్లో..!
జనాభా ప్రాతిపదికన లోకసభ సీట్లు పునర్:విభజన జరిగితే.. దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి… రాజ్యాంగ సవరణపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డ ఆయన.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి దమ్ముంటే.. తెలంగాణకు ప్రాజెక్టులను తీసుకురావాలని డిమాండ్ చేశారు.. ఇక, బీజేపీ, కాంగ్రెస్‌వి పబ్బం గడుపుకునే రాజకీయాలని విమర్శించిన ఆయన.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు తేకుంటే.. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. బీజేపీ కాంగ్రెస్ నేతలు ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయిన గుత్తా.. సీఎం కేసీఆర్ రాజ్యాంగం పునఃసమిక్ష చేయాలన్నారు.. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిడుతూ, అంబేద్కర్‌కు పాలాభిషేకం చేస్తున్నారని విమర్శించారు.