అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. టీఆర్ఎస్ రెండవ సారి గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు దామోదర్ ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో అన్న విషయం దామోదర తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రవేశ పెట్టిన పథకాలు లీడర్ల జెబుల్లోకి వెళ్ళేవి..టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరుగా ఆన్ లైన్ ద్వారా ప్రజలకు చేరుతున్నాయి.. అందోల్ నియోజకవర్గంలో దామోదర్ ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ నిర్మాణం చేశారో తెలాపాలి..అదే టీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూంలు ప్రజలకు నేరుగా చెందుతున్నాయి అన్నారు.
ఇక కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై దామోదర వ్యాఖ్యలు విడ్డూరం.. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అవినీతి చేశారో ప్రజలకు తెలియదా… అప్పుడు నేను జర్నలిస్ట్ గా పనిచేసాను. తెలంగాణలో కాంగ్రెస్ మీకు ఛాన్స్ ఇవ్వలేదు. మరో 14 నెలల కాలంలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయనే గ్రహించి దామోదర ప్రజల్లోకి వస్తున్నాడు. ఎన్నికల్లో దామోదర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న దుబ్బాక హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయించాడు. బీజేపీ పార్టీ భారతదేశాన్నే ప్రవేటీకరణ చేస్తున్న కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదు అని నిలదీశారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
