NTV Telugu Site icon

Vivekananda: రేవంత్‌ది ఐరన్ లెగ్.. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ జీరో..!

రేవంత్‌ రెడ్డి ఐరన్‌ లెగ్‌.. ఆయన అడుగుపెట్టడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ జీరో కాబోతోంది అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద.. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇమేజ్‌ను అపహాస్యం చేసేలా రేవంత్ మాట్లాడారని.. బీసీ జనగణను తక్కువ చేసి వ్యాఖ్యానించారని.. వెంటనే బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. రేవంత్ రెడ్డిని ఇప్పటికే ప్రజలు అస్యహించుకుంటున్నారన్న వివేకానంద.. రేవంత్ చెప్పినట్టు కాంగ్రెస్ దేశానికి అంత సేవ చేస్తే.. మరి ఆ పార్టీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది..? అంటూ ఎద్దేవా చేశారు.

Read also: AP: పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ పని చేయి..

మరోవైపు.. రేవంత్‌రెడ్డి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే బాల్క సుమన్.. బీజేపీకి రేవంత్‌.. బీ టీమ్‌గా పనిచేస్తున్నాడా? అని నిలదీసిన ఆయన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ మాట్లాడనికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.. ఇక, ధాన్యం సేకరణపై ఏప్రిల్ 2 వరకు వేచి చూస్తాం… అప్పటికి కేంద్రం నుంచి స్పందన రాకపోతే బీజేపీ నేతల భరతంపడతామని హెచ్చరించారు.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ రైతులను వంచిస్తున్నాయని మండిపడ్డారు బాల్క సుమన్.. రేవంత్ బారి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకోవడంపై రాహుల్ దృష్టి పెట్టాలని సూచించిన ఆయన.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి… బీజేపీ నేతలు గుజారాత్‌కు గులాంలు అని సెటైర్లు వేశారు.