Site icon NTV Telugu

విశాఖ ఉక్కు లాగే… సింగరేణిపై కుట్ర‌.. తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నం..!

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ లాగే.. సింగ‌రేణిపై కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కుట్ర చేస్తోంద‌ని మండిప‌డ్డారు తెలంగాణ ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్… సింగరేణి కార్మికులు సమ్మె చేసినా ప్రైవేట్ ప‌రం చేసే కుట్ర మోడీ చేస్తున్నార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. ఈ ప‌రిణామాల‌న్నీ తెలంగాణపై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాద‌న్నారు.. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా… నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. విశాఖ ఉక్కు లాగానే… సింగరేణి నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జ‌రుగుతోంద‌ని ఫైర్ అయ్యారు.

Read Also: కేసీఆర్ ఇప్ప‌టికైనా నేల మీద న‌డువు.. ఎన్నికలు లేకుంటే దళిత బంధు ఉండేదా..?

కేంద్రం ప‌ద్ధ‌తి మార్చుకోకపోతే ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆందోళ‌న‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు బాల్క సుమ‌న్.. కేంద్ర ప్ర‌భుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా.. మొండి వైఖరితో బీజేపీ ఉంద‌ని దుయ్య‌బ‌ట్టిన ఆయ‌న‌.. గుజరాత్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణకి ఇంకో నీతా అని ప్ర‌శ్నించారు.. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి… తెలంగాణకు సింగ‌రేణి గనులు ఎందుకు ఇవ్వ‌రు? అని ప్ర‌శ్నించారు.. ఇదంతా తెలంగాణ ప్రగతిని దెబ్బ కొట్టే కుట్ర అని పేర్కొన్న ఆయ‌న‌.. మోడీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు.. ఇక‌, బీజేపీ నేతలను నిలదీయడంతో కేంద్రానికి సెగ త‌గిలేలా చేయాల‌ని సూచించారు బాల్క సుమ‌న్.

Exit mobile version