Site icon NTV Telugu

దళితులకు బీజేపీ వ్యతిరేకం.. అది ఆ పార్టీ మూల సిద్ధాంతం..!

Balka Suman

Balka Suman

దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. మొదట హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్‌ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.. దళితులకు బీజేపీ వ్యతిరేకం.. అది ఆ పార్టీ మూల సిద్ధాంతమని వ్యాఖ్యానించారు.

ఇక, దళిత ప్రజలకు మంచి చేయాలని బీజేపీకి ఆలోచన ఉంటే.. బండి సంజయ్‌కి దమ్ముంటే.. దళిత బంధుకోసం రూ. 50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాలని డిమాండ్‌ చేశారు బాల్క సుమన్… దళితుల్లో మార్పుకోసం ఈ పథకం నాంది పలుకుతుందన్న ఆయన.. దళిత సాధికారత కోసం బడ్జెట్ లోనే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారన గుర్తుచేశారు.. ఇది ఉప ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దళితుల అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మేధావులతో చర్చలు జరిగాయని తెలిపారు సుమన్. మరోవైపు.. సింగరేణి ఖాళీ స్థలాల్లో జీవో 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు పొజిషన్లో ఉన్న వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.

Exit mobile version