Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌ నేతలు బియ్యం స్మగ్లింగ్‌తో కోట్లు ఆర్జిస్తున్నారు: అరవింద్‌

టీఆర్‌ఎస్‌ నేతలు బియ్యం స్మగ్లంగ్‌తో కోట్లు ఆర్జిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికి దిగారు. గిరిజన యూనివర్సీటీకీ రాష్ర్ట ప్రభుత్వమే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అండతోనే మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని అరవింద్‌ అన్నారు.

ఎఫ్‌సీఐకి తెలంగాణలో పండే పంటను తక్కువగా ఇస్తూ, రీస్లైకింగ్‌ బియ్యం ఎక్కువగా ఇస్తూ కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు రైతుల మీద ప్రేమ లేదని, కేసీఆర్‌, కేటీర్‌ బట్లర్లుగా తయారైయ్యారన్నారు. ఈ విషయం గత మూడు నెలల కిందటనే చెప్పానన్నారు. రైస్‌ మిల్లర్లు పది నుంచి పన్నెండు శాతం తరుగు తీస్తున్న ఎందుకు కేటీఆర్‌, కేసీఆర్‌ మాట్లాడటం లేదో చెప్పాలని అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

రైస్‌మిల్లర్లతో టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మకైయ్యారన్నారు. రైతుల పొట్ట కొడుతూ రైతులపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేసీఆర్‌ ఆగం పట్టిస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ విమర్శలు ఆపి రైతుల ధాన్యం కొనాలని, కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని ధర్మపురి అరవింద్‌ ఘాటుగా హెచ్చరించారు.

Exit mobile version