Site icon NTV Telugu

Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల

Tammineni Krishnaiah

Tammineni Krishnaiah

ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. నేడు కృష్ణయ్య అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూరల్‌ మండలంలో 144 సెక్షన్‌ విధించారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో కృష్ణయ్య అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతిలు పాల్గొన్నారు.

తన భర్త తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే కారణమని భార్య మంగతాయమ్య ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న తమ కుటుంబాన్ని చూసి ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. సీపీఎం నాయకుల హత్య రాజకీయాలు, అక్రమాలను చూసే తాము పార్టీ నుంచి బయటకొచ్చామని తెలిపారు. హత్యలు చేస్తే బెదిరిపోయే రోజులు పోయాయని, ఇలాంటి ఘటనల వల్ల తమ కుటుంబం భయపడదని చెప్పారు. తాము ప్రజల కోసం పని చేశామని, ప్రజలు తమ వెంటే ఉంటారని వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన మంగతాయమ్మ.. నిందితుల్ని శిక్షించేవరకూ పోరాడుతామని అన్నారు.

అయితే.. కృష్ణయ్య హత్యతో సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం నేతలు చెప్తున్నారు. హత్యా రాజకీయాల్ని తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సాహించదని, సీపీఎం నేతల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని అన్నారు. మరోవైపు.. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ జరుపుతోంది. కృష్ణయ్యను హత్య చేసి, పారిపోయిన నిందితుల్ని కచ్ఛితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ యంత్రాంగం తెలిపింది.
Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల

Exit mobile version