NTV Telugu Site icon

ఈటల, రఘునందన్‌పై ఈసీకి ఫిర్యాదు.. చర్యలు తీసుకోండి..!

హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. అధికార పక్షం టీఆర్ఎస్‌పై ఓవైపు బీజేపీ ఫిర్యాదులు అందిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ గీత దాటుతోంది ఇవిగో ఆధారాలంటూ టీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇక, ఇవాళ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుతో పాటు.. 31-హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు టీఆర్‌ఎస్‌ నేతలు.. రఘునందన్ రావు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని.. బీజేపీ అభ్యర్థి ఈటల సమక్షంలోనే చేశారని.. ఈ వ్యవహారంలో ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు టీఆర్ఎస్‌ నేతలు.