Yadadri Dharmal Power Plant: యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్న రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేశారు అధికారులు. దీంతో యాదాద్రి ప్లాంట్ పవర్ జనరేషన్లో చారిత్రక ఘట్టం మొదలయింది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో జెన్ కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేశారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల మూడు యూనిట్లతో 24,00 మెగా వాట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4,000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైంది.
Read also: Attack On Woman: గెలుస్తామని నమ్మకం ఉన్నపుడు దాడులు చేయటం ఎందుకు.. దాడిలో గాయపడిన మంజుల..
ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైటీపీఎస్ పనుల పురోగతిని పరిశీలించిన విషయం తెలిసిందే. వైటీపీఎస్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్లాంట్‌లో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది? బొగ్గు తరలించే రైల్వే ట్రాక్ నిర్మాణ పురోగతి, గతంలో జరిగిన పనుల బిల్లుల చెల్లింపులు, రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై మంత్రులు సమీక్షించారు. ఇంకా ఎంత మందికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది… తదితర అంశాలతో ప్రపంచం మొత్తం హరిత విద్యుత్, పునరుత్పాదక ఇంధనం వైపు దూసుకుపోతుంటే గత పాలకులు థర్మల్ పవర్ పై దృష్టి సారించారు. వివిధ కారణాలతో జాప్యం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్లాంట్‌లో నైపుణ్యం, నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటీరియల్ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Corpses Festival: ఇదెక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం.. శవాలతో పండగ ఏంట్రా బాబు