MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఇవాళ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరిగాయి. ఈ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ (మే 2కు) రిజర్వ్ చేసింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిటషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
Read also: Nitin Gadkari: నేడు ఏపీకి నితిన్ గడ్కరీ..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయామన్నారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందని తెలిపారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవని కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. “కవితకు బెయిల్ ఇవ్వొద్దని, కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాల్టికి (మే 2కు) రిజర్వ్ చేసింది. అయితే నేడు కవితకు బెయిల్ రానుందా? ట్రయల్ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!