ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- 12 గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
- భార్య పేరుతో ఫ్లాట్లు, కమర్షియల్ భవనాలు
- నగదు, బంగారం, కార్లు స్వాధీనం
- 2019 లంచం కేసు తర్వాత మరోసారి దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్‌కో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గత 12 గంటలుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు, నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కియా, మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముత్యం వెంకటరమణ ప్రస్తుతం రెడ్కోలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
భార్య పేరుతో ఫ్లాట్లు.. గతంలోనూ లంచం కేసులో అరెస్ట్
సోదాల్లో ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆంజనేయనగర్, మూసాపేట్ ప్రాంతాల్లో 10 ఫ్లాట్లు, నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాలు, ఖానామెట్ గుట్టల బేగంపేట్‌లో G+5 కమర్షియల్ భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2019లో రూ.26 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముత్యం వెంకటరమణపై అప్పటి నుంచే నిఘా కొనసాగుతోందని, విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?