NTV Telugu Site icon

Traffic Diversions: బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణ సంబరాల వేళ భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Diversions

Traffic Diversions

Traffic Diversions: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జూన్ 2న హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) ట్రాఫిక్ పోలీసులు మళ్లింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ తదితర ప్రాంతాల్లోని అమరవీరుల స్థూపం వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రిహార్సల్స్ జరుగుతున్న మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.

Read also: Passport Services: హైదరాబాద్ లో పాస్‌పోర్టు సేవలు బంద్‌.. స్పందించేవారే లేరు..

ట్రాఫిక్ మళ్లింపు..

* ఉదయం 9 నుండి 10 గంటల వరకు గన్‌పార్క్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. నాంపల్లి టి జంక్షన్ నుండి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు కాకుండా బషీర్‌బాగ్ బిజెఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.
* సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వీవీఐపీ వాహనాలు ఉంటాయి. దీంతో సాధారణ వాహనదారులు తమ వాహనాలు వెళ్లిపోయిన తర్వాతే అనుమతించనున్నారు. CTO మరియు ప్లాజా జంక్షన్ వద్ద ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
* హుస్సేన్‌నగర్ ప్రాంతంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబడతాయి. ట్యాంక్‌బండ్‌పై సికింద్రాబాద్ వైపు వాహనాలకు అనుమతి లేదు. రాణిగంజ్ మరియు కర్బలా ప్రాంతం నుండి వచ్చే వాహనాలను అనుమతించరు. బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.

Read also: Telangana BJP: నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..

ఈ ఆంక్షలను అమలు చేస్తూనే ట్రాఫిక్ పోలీసులు మరికొన్ని కీలక సూచనలు చేశారు. అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ కు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఆ జంక్షన్‌ల నుంచి కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవని విజ్ఞప్తి చేశారు. రవీంద్రభారతి, ఏఆర్ పెట్రోల్ బంక్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి జంక్షన్, అప్పర్ ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహం, కర్బలా జంక్షన్, బైబిల్ హౌస్, సీటీఓ జంక్షన్, ప్లాజా జంక్షన్, ఎస్‌బీఐ జంక్షన్, టివోలి జంక్షన్ వంటి జంక్షన్‌ల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా వెళ్లాలని సూచించారు. మార్గాలు. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలకు నగర ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ-సిగరెట్‌ సరదాగా కూడా తాగకండి.. ఒక వేళ తాగారో..