Site icon NTV Telugu

Breaking : ట్రాక్టర్‌ ఎక్కి బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. అరెస్ట్‌..

Revanth Reddy

Revanth Reddy

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విద్యార్థుల నిరసనగా విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచాయి. అయితే.. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు బాసర వెళ్లే క్రమంలో అడుగడుగునా పోలీసు పహారా కాస్తుండ. ఎలాగైనా విద్యార్థులను కలవాలన్న పట్టుదలతో రకరకాల మార్గాలలో కారు, ట్రాక్టరు, కాలిబాటన వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి అంతిమంగా క్యాంపస్ లోపలికి చేరుకున్న తర్వాత అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version