లోక్ సభకు తెలంగాణ వరదల రచ్చ తాకింది. కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోతు వానలు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. దీంతో.. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. తెలుగురాష్ట్రాల్లో వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో.. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. అయితే.. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని, జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో తాజాగా తెలంగాణ వరదల రచ్చ పార్లమెంట్ ను తాకింది. రాష్ట్రంలో వరదలపై లోక్ సభలో మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో.. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చాయని, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కావున దీనిపై వెంటనే సభలో చర్చించాలని తీర్మానంలో కోరారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయని, 11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయని తన తీర్మానంలో వివరించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో.. వానల పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి 2 వేల కోట్ల రూపాయల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలని రేవంత్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. వరదల విధ్వంసంతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Fight for jeans : జీన్స్ కోసం గొడవ.. భర్తపై కత్తితో దాడిచేసిన భార్య..
